viral news:వైసీపీని ఇంటికి పంపడానికి సిద్ధం..దేవినేని అవినాష్ పోస్ట్

by Indraja |
viral news:వైసీపీని ఇంటికి పంపడానికి సిద్ధం..దేవినేని అవినాష్ పోస్ట్
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ నాయకుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఈ రోజు x వేదికగా ఓ ఫోటోని షేర్ చేశారు. కాగా ఆ ఫొటో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కాగా ఆ ఫోటో పైన సిద్ధం అని రాసి ఉంది.. కాగా ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. వైసీపీకి ఏ సమస్య వచ్చిన టీడీపీ పైకి తోసేస్తారు అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు దేనికిరా సిద్ధం అది మెన్షన్ చెయ్యరా బాబు అని కామెంట్ చేశారు. కాగా ఓ వ్యక్తి సిద్ధం అనే పదాన్ని వాడి కొన్ని వ్యాఖ్యలే రాసారు.

వైసీపీని ఇంటికి పంపించాడని సిద్ధం. వైసీపీని అద్దెకు తీసుకున్న నాయకుడిని జైలుకు పంపడానికి సిద్ధం.. దళితులను చంపించిన నాయకుడిని జైలుకు పంపించాడనికి సిద్ధం. కోడి కత్తి కేసులో శీనుకి అన్యాయంగా 5 సంవత్సరాలు గా బెయిల్ రాకుండా అడ్డుకున్న వైసీపీ నాయకుడిని ఇంటికి పంపడానికి సిద్ధం అని దేవినేని అవినాష్ చేసిన పోస్ట్ కి కామెంట్ చేసారు. దేవినేని అవినాష్ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానంతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి సిద్ధం అనే ఉద్దేశంతో ఆ పోస్ట్ పైన సిద్ధం అని మెన్షన్ చేసి ఉండొచ్చు.. కానీ ఆ నెటిజన్స్ ఆ సిద్ధాన్ని వాళ్లకు నచ్చినట్లు మలుచుకుంటూ ఆ పోస్ట్ పై విమర్శల జల్లులు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story