- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap news: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కొరడా.. 33 ఆటోల సీజ్, 16 కేసులు నమోదు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో జరిగిన ఆటోల ప్రమాదాలతో ఆర్టీఏ అప్రమత్తమైంది. రాష్టవ్యాప్తంగా ఆటోలపై కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆటోలకు ఆర్టీఏ అధికారులు జరిమానా విధిస్తున్నారు. లైసెన్స్ లేని ఆటోలను వెంటనే సీజ్ చేస్తున్నారు. ఆరుగురికి మించి పిల్లలున్న ఆటోలను సైతం సీజ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీల్లో 33 ఆటోలు సీజ్ చేశారు. 16 కేసులు నమోదు చేశారు. అలాగే ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. విజయవాడలోనూ స్కూలు ఆటోలను తనిఖీలు చేశారు. రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు ఆవగాహన కల్పించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాహన డ్రైవర్లు నిబంధనలు పాటించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవింగ్ చేసి వాహనాలు నడపొద్దని సూచించారు.
Advertisement
Next Story