- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
48 కళాశాలలకు అటానమస్ హోదా.. హైకోర్టుకు చేరిన రగడ
దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: కళాశాలకు స్వయం ప్రతిపత్తి కోసం కళాశాల యాజమాన్యాలు నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆరుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకుంటుంది. అయితే గతేడాది నుంచి నేరుగా స్వయంప్రతిపత్తి కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ ప్రకటించింది. కళాశాల ఏర్పాటై పదేళ్లవడంతో పాటు రెండేళ్ల స్టేటస్ 2-ఎఫ్ హోదా ఉండాలి. దీంతో పాటు న్యాక్ లేదా ఎన్‌బీఏ గుర్తింపు అవసరం. తద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని, యూనివర్సిటీ ఎన్‌వోసీ అవసరం లేదని జేఎన్‌టీయూకే వర్గాల వాదన. స్వయంప్రతిపత్తి హోదా పొందిన కళాశాలలు గుర్తింపు పత్రాలు సమర్పిస్తే ఎండార్స్‌మెంట్ (ఆమోదం) ఇస్తాయని యూనివర్సిటీ వర్గాల వాదన. కళాశాల కార్యవర్గం, అకడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ స్డడీస్, ఫైనాన్స్ కమిటీలకు ఒక ప్రతినిధి (నామినీ)ని నియమించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెబుతున్నారు. 2023 వరకు కొన్ని కళాశాలలు జేఎన్‌టీయూకే కు ఎన్‌వోసీ కోరితే, మరి కొన్ని కళాశాలు నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా యూజీసీ అనుమతివ్వడంతో అర్హత లేని వాటికీ గుర్తింపు దక్కిందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో గతంలో పనిచేసిన వారి పాత్ర ఉన్నప్పటికీ ప్రస్తుత రిజిస్ట్రార్ ఎల్.సుమలత హైకోర్టు నోటీసులు అందుకోవడం గమనార్హం.
48 కళాశాలలకు గుర్తింపు ఇచ్చిన అంశంతో..
కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వివాదాలకు కేంద్ర బిందువైంది. రాష్ట్రంలోని 48 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ ఎన్‌వోసీలు ఇచ్చారంటూ ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలవడంతో వివాదం రచ్చకెక్కింది. ఫిర్యాదుదారు పేర్కొన్న జాబితాలో విజయనగరం జేఎన్‌టీయూ పరిధిలోని తొమ్మిది కళాశాలలతో పాటు 2001- 2002లో స్వయంప్రతిపత్తి దక్కించుకున్న కాకినాడ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, 2014-15 నుంచి 2023-24 మధ్య స్వయం ప్రతిపత్తి హోదా పొందిన కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని కళాశాలలూ ఉండటం గమనార్హం. అయితే ఆయా కళాశాలకు అటానమస్ నిబంధనల ప్రకారమే దక్కిందా, అర్హత లేకున్నా మేలు చేశారా? అనే అంశం తేలాల్సి ఉంది.
కోర్టుకెక్కిన అటానమస్ రగడ
48 ఇంజినీరింగ్ కళాశాలలు అటానమస్ హోదా పొందే విషయంలో రిజిస్ట్రార్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఓసీ జారీ చేశారని ఈ వ్యవహారంపై సీబీఐ,ఈడీ తదితర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ జోసఫ్ శ్రీహర్ష, మేరీ ఇంద్రజా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీకే రావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. 23న విచారణకు రిజిస్ట్రార్ హాజరు కాలేదు. న్యాయవాదిని నియమించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి కేసు దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై రిజిస్ట్రార్ అత్యవసరంగా ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.