‘విజయసాయిరెడ్డితో ఏ సంబంధం లేదు’..ఎమోషనల్ అయిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి

by Jakkula Mamatha |   ( Updated:2024-07-15 03:14:14.0  )
‘విజయసాయిరెడ్డితో ఏ సంబంధం లేదు’..ఎమోషనల్ అయిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం దారుణమని దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాపోయారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరేవారితో బిడ్డను కన్నదని మొదటి భర్త మదన్‌మోహన్ చేసిన ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. మాజీ భర్త ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని కేవలం డబ్బుల కోసమే ఇలా నాపై కుట్ర చేస్తున్నారని శాంతి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నానని చెప్పారు. వైఎస్‌ఆర్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు. మదన్‌తో గతంలో విడాకులు తీసుకున్నానని చెప్పారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో కోర్టు నుంచి కూడా విడాకులు తీసుకునేందుకు మదన్ మోహన్, తాను అప్లై చేసినట్టు చెప్పారు. అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్టు ఒక పత్రిక కథనాలు రాయడంతో అది నిజమని నమ్మి, తనకు 70 కోట్లు ఇవ్వాలి అని మాజీ భర్త వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపు చర్యల్లో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు అక్రమ సంబంధం అంటగడుతూ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని శాంతి ఆరోపించారు.ఇదే విషయమై కాసేపట్లో వైఎస్‌ఆర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed