- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ ఆఫీసుకు ఎమ్మెల్యేల క్యూ.. ఈ రోజు ఎంతమంది వెళ్లారంటే..!
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు సమీస్తున్న వేళ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలనే బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో సర్వేలు చేయించిన ఆయన దాదాపు 60 స్థానాల్లో అభ్యర్థులు మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి నియోజకవర్గాలను మారాలని నచ్చజెబుతున్నారు. అనంతరం వారికి స్థానభ్రంశం కల్పిస్తున్నారు. దీంతో మిగిలిన నేతల్లో ఆందోళనలు నెలకొన్నాయి. మరికొంతమంది నేతలు మాత్రం గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సీఎం జగన్‌ను పలువురు ఎమ్మెల్యేలు కలిశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లడంతో జగన్‌ను కలిసేందుకు ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు బయల్దేరి వెళ్లారు. ఇవాళ సాయంత్రంలోపు సీఎం జగన్‌తో మాట్లాడి ఓ నిర్ణయానికి రానున్నారు. కచ్చితంగా సీటు రాదు అని తెలుసుకున్న కొంతమంది నేతలు అసలు అధిష్టానం వద్దే ఈ పంచాయితీని తేల్చుకోవాలని పలువురు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం బాట పట్టారు. నేరుగా సీఎం జగన్ మోహన్‌రెడ్డితోనే మాట్లాడి సీటు సంగతి తేల్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గం నేత దేవినేని అవినాశ్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైతం సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే జగన్ కలిసిన పలువురు ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తాజాగా సీఎం జగన్‌ను కలుస్తున్న నేతలు భేటీ తర్వాత తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.