- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: చంద్రబాబు పిటిషన్లపై ముగిసిన వాదనలు.. ACB కోర్టు కీలక నిర్ణయం..!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురయ్యింది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ రెండు పిటిషన్లపై జడ్డిమెంట్‌ను సోమవారం వెల్లడిస్తానని న్యాయమూర్తి తెలిపారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరుఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేయగా.. చంద్రబాబును తమకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై గురు, శుక్రవారాల్లో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
చంద్రబాబు తరుఫున దూబే.. సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఇరు వర్గాల వాదనలు ఇవాళ ముగిశాయి. దీంతో ఈ రెండు పిటిషన్లపై తీర్పును ఏసీబీ కోర్టు జడ్జి వాయిదా వేశారు. జడ్జిమెంట్‌ను సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందోనని అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.