అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి!చీకటి రాజకీయం మేము చెయ్యం: అయ్యన్నపాత్రుడు ధ్వజం

by Seetharam |
అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి!చీకటి రాజకీయం మేము చెయ్యం: అయ్యన్నపాత్రుడు ధ్వజం
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ తెలంగాణలో రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయని వెల్లడించారు. అంతేకాదు అన్ని పార్టీల నాయకులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ కండువా కప్పుకుని మరీ ప్రచారం చేస్తున్నారని అందువల్లే టీడీపీ పోటీకి దూరంగా ఉందని ప్రకటించారు. మద్దతు ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్‌గానే ఇస్తాం అని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘ అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి. టీడీపీ తెలంగాణలో పోటీ చెయ్యడం లేదు అని ప్రకటించింది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కావాలి అనుకున్న అన్ని పార్టీల నాయకులు చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ కండువా కప్పుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. మీ దొంగ నాయకుడిలా చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కి మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేము ఎప్పుడూ చెయ్యం. మద్దతు ఇవ్వాలి అనుకుంటే డైరక్ట్ గానే ఇస్తాం. మీలా అందితే జుట్టు, అందక పోతే కాళ్ళు మా సిద్దాంతం కాదు’ అని మండిపడ్డారు.

Advertisement

Next Story