APPSC:గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-24 11:45:28.0  )
APPSC:గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా!
X

దిశ,వెబ్‌డెస్క్: గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషించే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఛైర్ పర్సన్‌ను నియమించింది. ఇదివరకు హోంశాఖ సెక్రటరీగా(Home Secretary), ఇంటలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తించిన రిటైర్డ్ ఐపీఎస్ అనురాధను నియమిస్తూ బుధవారం ఏపీ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ(APPSC) ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో విజయవాడ(Vizayawada)లోని ఏపీపీఎస్సీ కార్యాలయం(APPSC office)లో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. ఈ క్రమంలో గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆమె ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్ల పై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధ తెలిపారు.

Advertisement

Next Story