APCC: ఇది సర్ధుబాటు కాదు.. సర్ధుపోటు.. వైఎస్ శర్మిల సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
APCC: ఇది సర్ధుబాటు కాదు.. సర్ధుపోటు.. వైఎస్ శర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు గత వైసీపీ ప్రభుత్వం(YCP Govt) చేసింది పాపం అయితే.. కూటమి సర్కారు(NDA Govt) శాపం పెడుతున్నదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress Chief) వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. విద్యుత్ చార్జీల(Electricity Charges) భారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దీనిపై షర్మిల.. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని కూటమి సర్కార్ ప్రజల నెత్తినే మోపుతోందని ఆరోపించారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో.. మా తప్పేం లేదని, మాకు అసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది సర్దుబాటు కాదని.. ప్రజలకు "సర్దుపోటు" అంటూ.. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్(Electric Shock) ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే విద్యుత్ ఛార్జీల విషయంలో.. రాష్ట్ర ప్రజలకు "వైసీపీ చేసింది పాపం అయితే.. కూటమి సర్కార్ శాపం పెడుతున్నది" అని మండిపడ్డారు.

ఇక గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధమని, ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా అని ప్రశ్నించారు. అంతేగాక 5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? వైసీపీకి మీకు ఏంటి తేడా అని నిలదీశారు. వైసీపీ 9సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోడీని గల్లా పట్టి అడగాలని, ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందని తెలిపారు. ప్రజల ముక్కు పిండి ట్రూ అప్‌ ఛార్జీల రూపంలో అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

Advertisement

Next Story