విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరసన

by Y. Venkata Narasimha Reddy |
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట నిరసనకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4200 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకొని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించి కార్మికులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవం, సేవ్ వైజాగ్ ప్లాంట్ అన్న నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తొలగించిన 4200 మంది విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానాలతో ఏర్పడిందని, అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపకుంటే ప్రజా ఉద్యమాలు మరింత ఉదృతం చేస్తమన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed