- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకుతప్ప ఇంకెందుకు పనికిరాడు.. అంబటి పై ఏపీసీసీ చీఫ్ ఫైర్..
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్స్ అధ్యక్షురాలిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుండి వైస్ షర్మిల జోరు పెంచింది. రాష్ట్రం లోని జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తూ ఆ జిల్లాల్లోని నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రకాశం జిల్లా లోని ఒంగోలు లో పర్యటించిన ఆమె ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అనే అంశం పై సమీక్ష నిర్వహించారు.
అనంతరం వరద కారణంగా గేట్లు కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టును షర్మిల పరిశీలించారు. జరిగిన ప్రమాదం పైన ఆమె మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంవత్సరానికో లేక రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారైనా రూ/ 2 కోట్లు లేక 4 కోట్లు విడుదల చేసిన ప్రాజెక్టు నిర్వహణ పనుల జరుగుతాయి అని పేర్కొన్నారు.
రాజశేఖర్ రెడ్డి రూ/ 700 కోట్లు వ్యచించి ప్రాజెక్టు కడితే.. కనీసం ఆ ప్రాజెక్టు కి సంబంధించిన నిర్వహణ చూసుకోవాలనే ఇంకితం కూడా లేదంటే.. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వైస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో జల యజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని వెల్లడించారు.
లక్ష ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందుతుందని.. అలానే ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా అందుతున్నదని పేర్కొన్నారు. అయితే ఈ రోజు ప్రజల పుణ్యమా అని వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నారని కానీ ఏ ఒక్కరన్న పని చేస్తున్నారా అని ఆమె ప్రశించారు..? ఇక ఇందుకు సంబంధించిన మంత్రి అయితే సంక్రాంతికి డాన్స్ లు చేస్తారు.. కానీ పనులు మాత్రం చెయ్యరంట అని ఎద్దేవ చేశారు.
ఇక్కడ ఏ మాత్రం నిర్వహణ ఉన్న ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఒంగోలు పట్టణానికి సైతం తాగు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నాయకులు ప్రతి రోజు నీళ్లు ఇస్తామని చెప్పారు కానీ ఒక్క రోజు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రెండు మూడు రోజులకు ఒక్కసారి కూడా తగు నీరు అందడం లేదని.. తాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ఈ పాపం వైసీపీది కదా అని ప్రశ్నించారు.
అంబటి రాంబాబు సంక్రాంతి డాన్సులు చేస్తాడు కానీ పనులు మాత్రం చేయడు - ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల pic.twitter.com/1FaiqZ5GQF
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2024