- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking:నేడు AP-TET నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కొత్త టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మెగా డీఎస్సీ త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో TET పరీక్షను నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు(సోమవారం) టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా,ఆగస్టు నెలలో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్ లైన్ విధానంలో ఈ టెట్ పరీక్ష జరుగుతుందని విద్యాశాఖ కమిషనర్ సురేష్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక cse.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మెగా డీఎస్సీకి, టెట్‌కు మధ్య 30 రోజుల వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దాదాపు 16,000 పోస్టుల భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.