AP: సీఎం జగన్‌పై రాయితో దాడి.. బుచ్చయ్య చౌదరి మాస్ ర్యాగింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ హల్‌చల్ (వీడియో)

by Shiva |
AP: సీఎం జగన్‌పై రాయితో దాడి.. బుచ్చయ్య చౌదరి మాస్ ర్యాగింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ హల్‌చల్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల స్టంట్స్ మొదలయ్యాయి. పార్టీ అధినేతలు ఇప్పటికే ప్రచార సభల్లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 12న విజయవాడలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో పాల్గొన్న సీఎం జగన్‌పై కొందరు దుండగులు ఆయనపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఎడమ కనుబొమ్మ పైన గాయం అయింది. అదేవిధంగా ఆయన పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది.

ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడిక్కాయి. తమ అధినేతపై దాడి చేయించారంటూ వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. సీఎంపైనే రాళ్లదాడి చేయిస్తారా అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అయితే, వారి ఆరోపణలు టీడీపీ నాయకులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. నాయకులపై దాడి చేయించేంత నీచ రాజకీయాలు టీడీపీలో లేవంటూ తెలుగు తమ్ము్ళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థి, టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గాయలైనట్లుగా కట్లు, బ్యాండేజీలతో ప్రెస్‌మీట్ పెట్టి వైస్ జగన్‌‌పై మాస్ ర్యాగింగ్ చేశారు. ముందుగా ఆయన అవతారం చూసిన మీడియా ప్రతినిధులు నవ్వగా.. ఏంటయ్యా నవ్వుతున్నారు అంటూ బుచ్చయ్య చౌదరి చమత్కరించారు. ‘బాధపడి, దెబ్బలు తగిలి ప్రాణాల మీదకు వచ్చింది, ఓ 6 నెలల పిల్లోడు నన్ను రాయేసి కొట్టేశాడు’ అంటూ సెటైర్లు వేశారు. ‘ముఖం, ముక్కు మీద.. అన్నింటి మీద దెబ్బలు తగిలినయ్.. ఓ ప్రజలారా నాకు ఓట్లు వేయండి’ అంటూ సీఎం జగన్‌ను అనుకరించారు. ఆ పిల్లాడు నన్ను కొట్టబోయాడు, చంపబోయాడు అతడిపై 307 సెక్షన్ కింద కేసు వేయండి. ‘అతడిని జైల్లో పెట్టండి.. వీలైతే చంద్రబాబు, లోకేష్‌ను కూడా జైల్లో పెట్టండి’ అంటూ మాస్ ర్యాగింగ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలో ఇన్‌స్టా‌గ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇదేం మాస్ ర్యాగింగ్ రా.. బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు జగన్‌ను పర్‌ఫెక్ట్‌గా దించేశారంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed