- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీకి చంద్రబాబు, పవన్.. పొత్తులపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు పొత్తుల వైపు తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీలతో బీజేపీ కూడా జత కలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజమేననే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధినేతలు గురువారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలను కలవనున్నారు. ఈ మేరకు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో మీడిాయాతో మాట్లాడుతూ చంద్రబాబు, జనసేన ఢిల్లీ పర్యటనతో బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తుందని తెలిపారు. అసలు పొత్తులు ఉంటాయా లేదా అనేది చంద్రబాబు, పవన్ కల్యాణ్ త్వరలో స్పష్టత ఇస్తారని చెప్పారు. శుక్రవారం కల్లా పొత్తు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.