- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Delhi: కాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు ఢిల్లీలో ఉత్కంఠ రేపుతున్నాయి. పొత్తులపై బీజేపీ అదిష్టానంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పపన్ కల్యాణ్ చర్చలు జరుపుతున్నారు. ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై గురువారం సాయంత్రం నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న అసంపూర్తిగా చర్చలు ముగిశాయి. దీంతో ఇవాళ కూడా బీజేపీ నేతలతో చంద్రబాబు, పవన్ చర్చలు జరుపుతున్నారు. మరికాసేపట్లో కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లానున్నారు. దేశవ్యాప్తంగా 370కి పైగా సీట్లు గెలవాలనే లక్ష్యంగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్నిఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 5 ఎంపీ, పది అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అటు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఢిల్లీలో ఉన్నారు. వీరితో బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చించారు. అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ తర్వాత పొత్తులు, సీట్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.