- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: పిఠాపురంలో పోలీసులు, ఫ్లైయింగ్ స్వ్కాడ్ తనిఖీలు.. 17 గాజు గ్లాస్ పెట్టెలు, బంగారం స్వాధీనం
దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురం ఇప్పడు ఏ నోట చూసిన ఆ నియోజకవర్గం పేరు మారుమోగుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ స్థానం నుంచి జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేయడం అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రచారం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే పవన్ తరఫున సోదరుడు నాగబాబు, భార్య, కొడుకు వరుణ్ తేజ్‌లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా టీవీ నటులు సైతం పవన్‌కు జై కొడుతూ.. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు ఆ నియోజకవర్గంలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓటర్లను పార్టీల నేతలు డబ్బు, మద్యం, వస్తువులు పంపిణీ చేసి మభ్య పెట్టకుండా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు ప్లయింగ్ స్క్వాడ్ కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ మేరకు కారులో తరలిస్తున్న గాజు గ్లాస్ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కారుతో పాటు గాజు గ్లాస్‌ల పెట్టెలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా గత రాత్రి రూ.17 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నా అధికారులు కారును పిఠాపురం తహసీల్దార్ ఆఫీస్‌కు తరలించారు.