Weather: ఈ నెల 19 నుంచి ఏపీలో వర్షాలు

by srinivas |   ( Updated:2023-06-18 09:57:27.0  )
Weather: ఈ నెల 19 నుంచి ఏపీలో వర్షాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 21 మధ్య రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story