- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మహిళలపై దాడులలో AP నెంబర్.1’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ(International Women's Day) శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. అసలు సృష్టే లేదు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ అని ఆమె పేర్కొన్నారు. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదు. ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగట్టిందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
వికసిత భారత్(Viksit Bharat)లో గంటకు 50 మందిపై భౌతిక దాడులు, రోజుకు 80 మంది పై లైంగిక వేధింపులు(Sexual harassment) జరగడం అత్యంత శోచనీయం అన్నారు. పేరుకే ‘నారీశక్తి వందన్ అదినియమ్’. ఆచరణలో మహిళలను నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీది తన అనుబంధ సంఘాలది అని ఆరోపణలు చేశారు. మహిళల భద్రతపై ఎన్ని ఫాస్ట్రాక్ చట్టాలు ఉన్నా పేరుకు తప్పా.. ఆచరణలో శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సైతం మహిళలకు గౌరవం లేకుండా పోయింది. గడిచిన 10 ఏళ్లలో 2 లక్షల వేధింపుల కేసులు నమోదు కావడం, గత 5 ఏళ్లలో 25 శాతం అఘాయిత్యాలు పెరగడం, 54 వేల మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు కావడం అత్యంత దారుణం అన్నారు.
ఈ క్రమంలో మహిళలపై దాడులలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నెంబర్.1 గా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసకు కారణం అవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మరోవైపు మహిళా సాధికారత అంటూ చేస్తున్నది కూడా మోసమే. మహిళలకు ఉచిత బస్సు(Free Bus Scheme)), నెలకు రూ.15 వందల ఆర్థిక సహాయం, సున్నా వడ్డీకే రుణాలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు లాంటి పథకాలు ఇస్తామని మహిళలకు మోసం చేశారని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
Read Also..
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: మాజీ సీఎం జగన్