- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Inter Board: ఈ నెల 15 నుంచే ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు
దిశ, డైనమిక్ బ్యూరో : ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశానికి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. ఈ నెల 15 నుంచి దరఖాస్తులు ఆహ్వానించి...జూన్ 26 నుంచి అడ్మిషన్లు కల్పిస్తారని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తొలిదశ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఎంవీ శేషగిరిబాబు వెల్లడించారు.
2023-24 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, కో ఆపరేటివ్, ఎపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఇన్సెంటివ్, ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలు, హైస్కూల్ ప్లస్, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలు, జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్‌లలో రెండేళ్ళ కాలపరిమితితో కూడా ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ఈ నెల 15నుంచి విక్రయిస్తారని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 14లోపు అందజేయాలని సూచించారు. అనంతరం 26 నుంచి తొలి దశ అడ్మిషన్లు ప్రారంభిస్తారని తెలిపారు. ఇంటర్నెట్ మార్కుల జాబితా, విద్యార్థులు చివరగా చదివిన పాఠశాల అధికారులు జారీ చేసిన పదో తరగతి పాస్ సర్టిఫికేట్, టీసీలతో తాత్కాలిక అడ్మిషన్లు కల్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
MP Raghurama Case: ఆ కాల్ డేటా భద్రపర్చండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం