AP High Court: నటి జత్వానీ కేసులో కీలక పరిణామం.. విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట

by Shiva |   ( Updated:2024-09-25 14:52:58.0  )
AP High Court: నటి జత్వానీ కేసులో కీలక పరిణామం.. విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముంబై సినీనటి కాదంబరి జత్వానీ (Kadambari Jatwani) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, రిమాండ్‌ పంపడంతో పాటు తనను, కుటుంబాన్ని కస్టడీలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారంటూ నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన డీజీపీ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నీ (Former DCP Vishal Gunny) ఇటీవలే ఏపీ హైకోర్టు(AP High Court)లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం అక్టోబర్ 1 వరకు విశాల్ గున్నీపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదపరి విచారణను అదే రోజుకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed