- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ పేషీ ఖాళీ.. ముగ్గురు IAS అధికారులను బదిలీ చేసిన ఏపీ సర్కార్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వంలో చకా చకా బదిలీలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లగా.. ఏపీ నూతన సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగానే, తాజాగా మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాలను సర్కార్ బదిలీ చేసింది.
ఈ మేరకు సీఎస్ సౌరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వలు జారీ చేశారు. ముగ్గురని సాధారణ పరిపాలన శాఖ (జీడీఏ)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తాజాగా ఈ ముగ్గురి అధికారల బదిలీతో జగన్ పేషీ ఖాళీ అయ్యింది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుని అధికారం కోల్పోయింది. ఈ క్రమంలోనే జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
- Tags
- Andhra Pradesh