- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: దిగొచ్చిన ప్రభుత్వం.. ఇవాళ ఒక్కరోజే 1,210 జీవోలు అప్‌లోడ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ జీవోలు ఎట్టకేలకు ఆన్‌లైన్‌లోకి ఎక్కాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన 1,210 జీవోలను అధికారులు ఇవాళ ఒక్క రోజే అప్ లోడ్ చేశారు. ఈ జీవోలన్నింటినీ ఇప్పటివరకూ గోప్యంగా ఉంచారు. కోర్టు విచారణ నేపథ్యలో హడావుడిగా ఈ జీవోలను అప్‌లోడ్ చేశారు.
కాగా జీవోల గోప్యతపై హైకోర్టులో పలు పిల్‌లు దాఖలు అయ్యాయి. ఈ పిల్‌లపై విచారించిన కోర్టు జీవోలు ఎందుకు గోప్యం ఉంచారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆన్‌లోన్‌లో అప్‌లోడ్ చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీసింది. జీవోల ద్వారా హక్కులు సంక్రమిస్తాయని, వాటిని ఎందుకు కాలరాస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఇక హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. జీవోలను వెబ్ సైట్‌లో ఉంచటంపై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పిస్తానని చెప్పడంతో విచారణను హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.
దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీవోలన్నీ అప్ లోడ్ చేయాలని అన్ని శాఖలకూ జీఏడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గోప్యంగా ఉంచిన అన్ని జీవోలను ప్రభుత్వ శాఖలు అప్ లోడ్ చేస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 1,210 జోవోలు అప్ చేశారు.