- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Govt.: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పోలవరం, అమరావతిపైనే కీలక చర్చ!
దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం (Cabinet Meeting) ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానందర్, ప్రభుత్వం సలహాదారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project), అమరావతి (Amaravati) నిర్మాణంపై కూడా డిస్కస్ చేయనున్నారు. అదేవిధంగా భూముల మార్కెట్ విలువ (Land Market Value), రిజిస్ట్రేషన్ ఛార్జీ (Registration Charges)ల పెంపు అంశాలు మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నాయి. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతోన్న తీరుపై సమీక్షించనున్నారు. ఇక ఎస్‌ఐపీబీ (SIPB) అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుతో సుమారుగా 2,63,411 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. నెల్లూరు (Nellore) జిల్లా రామయ్యపట్నం (Ramaiahpatnam)లో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ (BPCL) భారీ రిఫైనరీ ఏర్పాటుకు అమోద ముద్ర వేయనున్నారు. దీంతో మరో 2,400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.