వాగు దాటేందుకు బాలింత తీవ్ర అవస్థలు.. స్పందించిన ఏపీ సర్కార్!

by Jakkula Mamatha |
వాగు దాటేందుకు బాలింత తీవ్ర అవస్థలు.. స్పందించిన ఏపీ సర్కార్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పలు ప్రాంతాల్లో చినుకే పడితే రోడ్లన్ని అస్తవస్త్యంగా తయారవుతాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి. దీంతో రోడ్లన్ని చెరువులను తలపిస్తాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం ఓ బాలింతను కుటుంబ సభ్యులు ప్రమాదకర పరిస్థితుల్లో భుజం పై మోసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అందరినీ తీవ్ర స్థాయిలో కలిచి వేసింది.

బాలింతను కుటుంబ సభ్యులు పెద్దేరువాగు దాటించారు. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి మంత్రి చలించిపోయారు. తాజాగా ఈ ఘటన పై ఏపీ సర్కార్ స్పందించింది. ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి అధికారులతో మాట్లాడి బాలింతలు వాగు దాటేందుకు రోప్ వే బ్రిడ్జిని మంజూరు చేయించారు. రూ.70 లక్షలతో అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వర్షాలు తగ్గాక త్వరలో రోప్ వే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed