లవర్స్‌కు గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకుంటే రూ.1.2 లక్షల నగదు గిఫ్ట్.. జీవో ఇచ్చిన ఏపీ సర్కార్

by sudharani |   ( Updated:2023-05-04 08:09:19.0  )
లవర్స్‌కు గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకుంటే రూ.1.2 లక్షల నగదు గిఫ్ట్.. జీవో ఇచ్చిన ఏపీ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యతరగతి కుటుంభాలకు ఆడపిల్ల పెళ్లి అంటే అతి పెద్ద కష్టం. అలాంటి వారికి ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకొచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. మధ్య తరగతి కుటుంభాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

SC, ST, మైనార్టీలకు రూ. లక్ష చొప్పున, కులాంతర వివాహాలకు రూ. 1.2 లక్షలు, బీసీలకు రూ. 50 వేలు, బీసీల్లో కులాంతర వివాహాలకు రూ. 75 వేలు, దివ్యాంగులకు రూ. 1.5 లక్షలు, భవన కార్మికులకు రూ. 40 వేలు వధువు తల్లి ఖాతాకు జమ చేస్తామంది. అంతే కాకుండా ఈ పథకం పొందాలంటే వధూవరులు ఇద్దరూ టెన్త్ పాస్ కావాలని.. సచివాలయాలు, నవశకం పోర్టల్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

Read More: మీరు సక్సెస్ సాధించాలా?.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

Advertisement

Next Story

Most Viewed