- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News: వాల్మీకిబోయలను ఎస్టీల్లో చేర్చుతూ తీర్మానం
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని వాల్మీకిబోయ కులాన్ని ఎస్టీల్లో చేర్చుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. అలాగే దళిత క్రిస్టియన్లను సైతం ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేశారు. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రెండు తీర్మాలను కేంద్రానికి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా రెండు తీర్మానాలను అసెంబ్లీ ఆమోదించింది. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీ మేరకు వాల్మీకిబోయను ఎస్టీల్లో, దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతున్నట్లు అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టం చేశారు. గిరిజనులకు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదని సీఎం తెలిపారు.
కాగా భారత రాజ్యాంగ చట్టం 1951 జీవోఎంఎన్ 1527/1951 ప్రకారం వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించారు. 1968 వరకు వాల్మీకిబోయలు ఎస్టీల్లోనే కొనసాగారు. ఉమ్మడి ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో వాల్మీకిబోయల జనభా ఎక్కువ. దీనివల్ల ఆధిపత్య కులాలవారు బోయలను ఎస్టీలుగా ఉంటే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతారని భావించారు. దీంతో అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం వాల్మీకి బోయలను ఎస్టీ రిజర్వేషన్‌ను రద్దు చేసి బీసీ-జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులకు ఏపీ ప్రభుత్వం వాల్మీకిబోయలు ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.
ఇవి కూడా చదవండి: