రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. నిత్యావసరాల ధరలు తగ్గించిన ప్రభుత్వం

by Mahesh |
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. నిత్యావసరాల ధరలు తగ్గించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ మరో శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రజలకు మేలు కలిగించే.. నిత్యావసరాలు అయిన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బుధవారం అధికారులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.160 ఉండగా దానిని రూ.150 కీ బియ్యం రూ.48 ఉండగా.. రూ.47 కి, స్టీమ్డ్ బియ్యం రూ.49 ఉండగా.. దానిని రూ.48 కీ తొలగించడమైనది. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తారు తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం- ఈ నెల రోజుల లోపు బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని మంత్రి నాదేండ్ల మనోహర్ గుర్తు చేశారు.

Advertisement

Next Story