AP Budget 2024-25: ఏపీ బడ్జెట్.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

by Y.Nagarani |   ( Updated:2024-11-11 06:12:48.0  )
AP Budget 2024-25: ఏపీ బడ్జెట్.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బడ్జెట్ ను రూపొందించామన్నారు. 2024-25 బడ్జెట్ లో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది ఏపీ సర్కార్. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పయ్యావుల వెల్లడించారు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే చేతులకు సహాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. 2024-25 బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులకు ముందు.. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగంకోసం చేసిన కృషిని వివరించారు.

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాల కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని ప్రకటించిందని తెలిపారు. రైతుల సమగ్రాభివృద్ధికి వడ్డీలేని రుణాలు, భూసారం కార్డుల పంపిణీ, భూసార పరీక్షలు వంటి వాటిని అమలు చేస్తోందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రబీ కాలం నుంచి పంటల బీమాను సవరించడం, స్వచ్ఛంద నమోదును చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. పశుసంపద, కోళ్ల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో ఉందన్నారు. గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానం, మాంసం ఉత్పత్తిలో నాల్గో స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో ఉందని వివరించారు. పశుసంపదను పెంచేలా పలు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. పశువులను పెంచేవారి ఆదాయాన్ని పెంచేలా, వారి జీవనోపాధికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed