చంద్రబాబు నాటకంలో పవన్‌ది చిన్న పాత్ర: సజ్జల

by Disha Web Desk 9 |
చంద్రబాబు నాటకంలో పవన్‌ది చిన్న పాత్ర: సజ్జల
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, జనసేన పార్టీలపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని గొంతెత్తి చెప్పారు. చంద్రబాబుకు ఎందుకు లొంగిపోయాడో పవన్ ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. 2014 లో ఇదే కూటమి పోటీ చేసిందని, అప్పుడు ఎంత రాచి రంపాన పెట్టారో ప్రజలకు తెలుసునని సజ్జల వెల్లడించారు. కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీకి వేయించేందుకు పవన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా గ్రూపులు రోడ్డున పడ్డాయని తెలిపారు. డ్వా్క్రా మహిళలకు జగన్ చేయూతనిచ్చారని ఆయన మహిళలకు మంచి చేయడం కోసం ఆలోచిస్తారన్నారు. కానీ చంద్రబాబుకు మహిళలు అంటే చులకన అని సజ్జల టీడీపీ, జనసేన పార్టీలపై ఆరోపణలు చేశారు.



Next Story

Most Viewed