- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో తొలి ఫలితం.. అక్కడి నుంచే.. !
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తొలి ఫలితం ఎక్కడి నుంచి ఉంటుందనే ప్రశ్నలు వినిపించాయి. దీంతో ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ పరిధిలో కొవ్వూరు, నర్సాపురంలో 13 రౌండ్లు ఉంటాయని.. వీటి ఫలితాలు తొలుత విడుదల అవుతాయని వెల్లడించింది. ఇక చివరి ఫలితాలు భీమిలీ, పాణ్యంలో వెలువడతాయని తెలిపింది. ఈ రెండు చోట్ల 26 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందని పేర్కొంది. ఇక మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ చెప్పింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఆ తర్వాత సాధారణ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుందని తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.