- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు..ఆ పరీక్షలు ఎప్పుడంటే?
దిశ,వెబ్ డెస్క్:ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏపీఈఏపీసెట్ 2024 పరీక్షకు మార్చి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.దీనికి సంబంధించిన పరీక్షలు మే 13 నుంచి మే 19వ వరకు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కానీ.. రాష్ట్రంలో రీసెంట్ గా ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఆ తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.దీంతో పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ పరీక్షను వాయిదా వేసి మే 15 నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఏపీ పీజీసెట్ పరీక్ష జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభంకావల్సి ఉంది. అయితే జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంది. అంతే కాదు మిగతా పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో ఆ పరీక్ష తేదీల్లో మార్పులు చేసేందుకు విద్యామండలి కసరత్తు చేస్తుంది.