- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లె పండుగ.. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పవన్ కల్యాణ్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహించనున్న పల్లె పండుగపై అధికారులకు కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గతంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులకు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, NREGS ద్వారా మరో రూ.4500 కోట్ల నిధులు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని, అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండబోదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఆర్థిక సంఘం, కేంద్రం నుంచి వచ్చిన నిధులతో చేపట్టాల్సిన పనులపై ఈ సమావేశంలో కలెక్టర్లు, అధికారులతో చర్చించారు. ఇప్పటివరకూ 13,326 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశామన్న అధికారులు.. గ్రామాల్లో చేపట్టే పనులు, పనిదినాల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వివరించారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి వారంరోజుల పాటు పల్లె పండుగను ఘనంగా చేయాలని దిశానిర్దేశం చేశారు.