- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ కరోనా కల్లోలం..గ్రామాల్లో సైతం విస్తరిస్తున్న వైరస్
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 47,420 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 12,615 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,4,0056 చేరుకుంది. అయితే గత 24 గంటల్లో మహమ్మారి కారణంగా విశాఖలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,527 గా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,20,12,102 సాంపిల్స్‌ని పరీక్షించడం జరిగిందని వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. గ్రామాల్లో సైతం వైరస్ వేగంగా విస్తరిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని, లేకపోతే జరిమానా తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.