CM Jagan: ఆయన్ను చూసి నేర్చుకున్నా.. ఇదే నా పాలిటిక్స్!

by srinivas |   ( Updated:2023-03-15 15:48:42.0  )
CM Jagan: ఆయన్ను చూసి నేర్చుకున్నా.. ఇదే నా పాలిటిక్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అన్నీ గాల్లో మాటలేనని..ఏ చెబుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థమయ్యేది కాదని ఆయన ఎద్దేవా చేశారు. అదిగో బిల్ గేట్స్... అదిగో బుల్లెట్ ట్రైన్, అదిగో మైక్రోసాఫ్ట్ అని గొప్పగొప్ప మాటలు పలికేవారని సీఎం జగన్ గుర్తు చేశారు. అంతా గాల్లో.. గ్రాఫిక్స్‌లోనే కనిపించేదన్నారు. కానీ తన నడకమాత్రం నేలపైనేనని సీఎం జగన్ స్పష్టం చేశారు.

సామాన్యులతోనే ప్రయాణం

‘నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే. నా ప్రయాణం పేద వర్గాలతోనే. నా యుద్ధం పెత్తందారులతోనే. నా లక్ష్యం మాత్రం పేదరిక నిర్మూలనే. కాబట్టి నా ఎకనామిక్స్ వేరు’ అని సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పేద కుటుంబాలు బలపడితేనే పేద కులాలు బాగుంటాయి. పేద కుటుంబాలతోపాటు పేద కులాలను బలపరుస్తూ.. అన్ని సాధికారతలు ఇస్తేనే సమాజం బాగుంటుంది. సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఇది నమ్మా. ఆచరించా. ఫలితాలు కూడా చూపించా’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

ఇదే నా పాలిటిక్స్

‘ఇదే నా పాలిటిక్స్. ఇదే నా తండ్రిని చూసి నేర్చుకున్న హిస్టరీ. ఇవన్నీ కలిపితే మీ జగన్’. అని సీఎం వైఎస్ జగన్ అంటూ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ‘నాలుగేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. సామాజిక న్యాయం, మహిళకు న్యాయం, రైతన్నలకు న్యాయం చేయడాన్ని దైవకార్యక్రమంగా భావిస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story