వరదల్లో చంద్రబాబు.. తొలిసారి వైఎస్ షర్మిల పాజిటివ్ రియాక్షన్

by srinivas |
వరదల్లో చంద్రబాబు.. తొలిసారి వైఎస్ షర్మిల పాజిటివ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. విజయవాడకు వరద పోటెత్తినప్పటి నుంచి ఆయన అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. విజయవాడ సింగ్‌నగర్, చిట్టీనగర్, ప్రకాశ్ నగర్, మొగల్రాజపురంతో పాటు పలు ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. కాలినడకన, బోట్లు, జేసీబీలు, ట్రాక్టర్లపై వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్నారు. అధికార యంత్రాంగంతో వరద బాధితులకు ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్నారు. అయినా కొన్ని చోట్ల బాధితులకు ఆహారం అందకపోవడంతో అధికారులపై సీరియస్ అయ్యారు. అలాగే వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రైవేటు బోటు యాజమానులు డబ్బులు డిమాండ్ చేయడంతో వారికి చంద్రబాబు స్ట్రాంగ్ ఇచ్చారు.

ఇలా చంద్రబాబు నిరంతరం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. దీంతో ఆయన చేస్తున్న సేవలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీఎం చంద్రబాబుపై సాక్షాత్తు వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు. వరదల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరమని కితాబు ఇచ్చారు. ఆమె కాదు వరద బాధితులకు చంద్రబాబు చేస్తున్న సేవలను చాలా మంది నాయకులు, నటులు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం విమర్శలు చేస్తున్నారు. వరద బాధితులకు సేవలు అందించడంతో చంద్రబాబు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. అయితే సోదరి షర్మిల ప్రశంసిస్తే అన్న జగన్ విమర్శించడంపై ప్రజలు, సోషల్ మీడియాలలో నెటిజన్ల నుంచి సెటైర్లు వినిపిస్తున్నారు. కష్టకాలంలో సేవలు చేయాలని విమర్శలు చేయకూడదని జగన్ పై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుపై సోదరి షర్మిల ప్రశంసలు కురిపించడంపైనా స్పందిస్తున్నారు. చెల్లెను చూసి జగన్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. వైఎస్ షర్మిల హుందాతనం ప్రదర్శించారని కితాబిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed