- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ భేటీ జరగనుంది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఈ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లేవనెత్తాలని, అధిక నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నం చేయాలని సూచించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు హస్తినలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు.
మరోవైపు ఏపీలో జరుగుతున్న దాడులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన అక్రమాలు, దాడులు, అరాచకాలను జాతీయ స్థాయిలో వినిపించాలని భావిస్తోంది. ఈ మేరకు కసరత్తుల ప్రారంభించారు. ఇక టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి మంత్రులు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.