అణగదొక్కాలని చూశారు.. అనుభవించారు: బీఆర్ఎస్‌కు చంద్రబాబు చురకలు

by srinivas |   ( Updated:8 Feb 2025 1:56 PM  )
అణగదొక్కాలని చూశారు.. అనుభవించారు:  బీఆర్ఎస్‌కు చంద్రబాబు చురకలు
X

దిశ, వెబ్ డెస్క్: కాలానికి తగ్గట్టుగా మారాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Ap CM Chandrababu Naidu) అన్నారు. ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్(Delhi Election Results), మాజీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ (Former Cm Kejriwal)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కొందరు సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు దేశ రాజధాని ఢిల్లీకి చాలా పోలికలు ఉన్నాయని చెప్పారు. బటన్ నొక్కే మోడల్ ఢిల్లీలోనూ విఫలమైందని విమర్శించారు. గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor Scam) నథింగ్ అని కొట్టిపారేశారు. లిక్కర్‌లో అవినీతికి పాల్పడిన ఫ్యామిలీలు బాగుపడలేదన్నారు. రుషికొండ (Rushikonda) తరహాలో దేశరాజధానిలోనూ విలాసవంతమైన బిల్డింగులు నిర్మించారని చంద్రబాబు విమర్శించారు

తన అరెస్ట్ సమయంలో 60 దేశాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కానీ తెలంగాణ (Telangana)లో మాత్రం అణగదొక్కాలని ఆ నాటి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, ఆ ఫలితాన్ని అనుభవించిందని విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారన్నారు. తనకు వ్యక్తులను విమర్శించాలని ఉండదని తెలిపారు. వాళ్లు అవలంభించిన విధానాలు సరిగా లేవని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు.

Next Story

Most Viewed