- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh : ఢిల్లీకి ఏపీ సీఐడీ బృందం: Nara Lokesh కు బిగుస్తున్న ఉచ్చు
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నారా లోకేశ్‌ను ఏపీ సీఐడీ మెమోలో ఏ-14గా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. నారా లోకేశ్‌కు 41న ఏ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు నారా లోకేశ్‌కు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే సీఐడీ బృందం ఢిల్లీలో మకాం వేసి ఉంది. వీరికి తోడుగా ఏపీ నుంచి ఆరుగురు సభ్యుల సీఐడీ బృందం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. నారా లోకేశ్ విచారణకు సంబంధించి జాబితాను సీఐడీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు నారా లోకేశ్‌కు 41ఏ కింద సీఐడీ బృందం లోకేశ్‌కు ఇవ్వనుంది. మరికాసేపట్లో లోకేశ్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌కు సంబంధించిన కీలకమైన ఫైల్స్‌ను సీఐడీ బృందం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫైల్స్‌ను సుప్రీంకోర్టుకు అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిగా ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు కూడా వినాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ ఆధారాలను సైతం సుప్రీంకోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నారా లోకేశ్ సైతం ఢిల్లీలోనే ఉన్నారు. అక్టోబర్ 3 తర్వాత ఏపీకి రానున్నారు. ఢిల్లీలో సీఐడీ బృందం మకాం వేయడంతో నారా లోకేశ్‌ను ఏక్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే
లోకేశ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సైతం కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేశ్‌ను సైతం కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే లోకేశ్‌పై ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో సీఐడీ లోకేశ్‌ను ఏ-14గా చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ ప్రయత్నించినప్పటికీ చుక్కెదురు అయ్యింది. ఇకపోతే అటు తండ్రి చంద్రబాబు నాయుడు ఇటు తనయుడు లోకేశ్‌ల విషయంలో రకరకాల కేసులను తెరపైకి తెచ్చి వీలైనన్ని రోజులు జైలులో ఉంచాలన్నదే వైసీపీ పెద్దల వ్యూహం అన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సీఐడీ కార్యచరణ సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేశ్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఐఆర్ఆర్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ప్రచారం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి : Nara Bhuvaneshwari : జైల్లో Chandrababu Naidu ను చూసి కంటతడిపెట్టిన భువనేశ్వరి