- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ కేబినెట్ భేటీ.. చంద్రబాబు అధ్యక్షతన చర్చించిన అంశాలివే..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన ఈ మీటింగ్‌లో పోలవరం, రాజధాని ప్రాజెక్టులపై మంత్రులు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానికి కేంద్రప్రభుత్వం రూ. 15 వేలు కోట్ల ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం తాజా అంచనాలు, డయా ఫ్రం వాల్ పరిస్థితిపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపైనా చర్చించారు. కేంద్రం సాయం చేస్తే పోలవరం పనులు త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధానిలో నిలిచిపోయిన పనులను వెంటనే మొదలు పెట్టాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి శుక్రవారం వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులతో చర్చించాల్సిన అంశాలపైనా కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.