AP Budget: ఏపీ బడ్జెట్ పై ఆశలు.. వీటికే ప్రాధాన్యం?

by Y.Nagarani |   ( Updated:2024-11-11 03:55:43.0  )
AP Budget: ఏపీ బడ్జెట్ పై ఆశలు.. వీటికే ప్రాధాన్యం?
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లవ్వగా.. నాలుగు నెలలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account Budget) పైనే పాలన సాగించింది. నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభం కానుండగా.. తొలిరోజే అసెంబ్లీ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. ముఖ్యంగా సంక్షేమానికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సమయంలో ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్.. రాష్ట్ర బడ్జెట్ పై సీఎం చంద్రబాబుతో (CM Chandrababu) సుదీర్ఘంగా చర్చించారు. ఆర్థిక శాఖ అధికారులు ఆయనకు బడ్జెట్ పత్రాలను అందించగా.. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 11 గంటల 11 నిమిషాలకు మంత్రి పయ్యావుల (Minister Payyavula Keshav) అసెంబ్లీలో, మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధి రెండు రంగాలకూ సమ ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. అమల్లోకి వచ్చిన సూపర్ సిక్స్ (Super Six) హామీలకు, పెన్షన్లు, దీపం -2.0 (Deepam Scheme), అన్న క్యాంటీన్లకు నిధులు కేటాయించినట్లు సమాచారం. అలాగే ఇరిగేషన్, రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు, పోలవరం, రాజధాని పనుల పునః ప్రారంభానికి నిధుల లేమి లేకుండా చర్యలపై మంత్రి పయ్యావుల ఫోకస్ పెట్టారు. పెండింగులో ఉన్న ఫీజు రీఎంబర్స్ మెంట్ (Fee Reimbursement), ఆరోగ్యశ్రీ (Aarogyasri) నిధుల చెల్లింపులకు కూడా బడ్జెట్ కేటాయిస్తారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed