- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాజధాని ఏదో చెప్పుకోలేక రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు’
దిశ, తెలంగాణ బ్యూరో: వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనకు ప్రజలు చమరగీతం పాడాలని ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. హైదారాబాద్‌లోని బీఆర్ఎస్ ఏపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏపీలోని పలు జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి తోట గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూల్చివేతలతో ప్రారంభమైన వైసీపీ పాలనలో గత నాలుగేళ్లుగా అభివృద్ది పడకేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని గందరగోళ స్థితిలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేజిక్కించుకున్న జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సారధ్యంలో శరవేగంగా అభివృద్దిలో దూసుకుపోతుంటే ఏపీలో అందుకు భిన్నపరిస్థితులు నెల కొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ మోడల్‌ను ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర నాయకుడు తోట సుబ్బారావు, జాలే వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు గిద్దలూరు నుంచి రహమత్, అశోక్ కుమార్, బొర్రా శేఖర్ రంగస్వామి, రాకేష్, శేఖర్, దర్శి నుంచి నాగరాజు, బ్రహ్మనాయుడు, చీపురుపల్లి నుంచి విష్ణు గుప్త, శ్రీనివాసరావు, విజయవాడ నుంచి శంకర్, తిరువూరు నుంచి వంశీ, పసుపులేటి అశోక్, కోడూరు నుంచి జాకీర్ హుస్సేన్, కాకినాడ నుండి శివకుమార్, జగ్గయ్యపేట నుంచి చంద్ర, యర్రగొండపాలెం నుంచి ప్రభాకర్, ఒంగోలు నుంచి శివయ్య, మదనపల్లి నుంచి సుబ్బరాజు, తిరుపతి నుంచి ధనుంజయరాజు, ధర్మవరం నుంచి సత్యన్నారాయణ యాదవ్, గురజాల నుంచి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈదా చెన్నయ్య, తోట హేమంత్ తదితరులు పాల్గొన్నారు.