- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: అధిష్టానం నుంచి పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి సోము వీర్రాజు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. బీజేపీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్రమంత్రులను సోము వీర్రాజు కలవనున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో సోము వీర్రాజు అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఇద్దరు నేతలు కూడా ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రిగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి సేవలు అందించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న నేత కావడంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కిరణ్ కుమార్ రెడ్డిని ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అంతేకాదు రాయలసీమకు చెందిన నేత కావడంతో అక్కడ కూడా పార్టీ బలపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుండటంతో తెలుగు వారు ఉన్న ప్రాంతాల్లో కిరణ్ కుమార్ రెడ్డితో ప్రచారం చేయించాలని యోచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.