- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో బీజేపీ అభ్యర్థులు వీరే.. ఆ రోజే లిస్టు విడుదల.. ?
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అన్ని పార్టీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. అధికార బీజేపీ పార్టీ ఇప్పటికే రెండు విడుతల్లో అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. అయితే ఈ రెండు లిస్టులో కూడా ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే అభ్యర్థులు ఎవరనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ మూడో లిస్టును విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల 22న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నారు. ఆ తదుపరి రోజున బీజేపీ మూడో లిస్టు విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలోని అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌కు తమ అభ్యర్థుల లిస్టును రాష్ట్ర బీజేపీ నేతలు అందజేశారు. అరకు-వంగా గీత, అనకాపల్లి-సీఎం రమేశ్, రాజమండ్రి-పురంధేశ్వరి, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేశ్, హిందూపరం నుంచి సత్యకుమార్ లేదా పరిపూర్ణనందస్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపనా చౌదరి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, పి.గన్నవరం, కైకలూరు, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, రాజంపేట అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ లిస్టును సైతం రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌కు అందజేశారు. దీంతో ఈ నెల 23న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు విడుదలయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...