బిగ్ బ్రేకింగ్: మొదలైన నిమిషాల్లోనే ఏపీ అసెంబ్లీ వాయిదా.. సభలో తీవ్ర గందరగోళం

by Satheesh |   ( Updated:2023-09-22 06:21:52.0  )
బిగ్ బ్రేకింగ్: మొదలైన నిమిషాల్లోనే ఏపీ అసెంబ్లీ వాయిదా.. సభలో తీవ్ర గందరగోళం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండవ రోజు సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని.. సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్ పోడియంను చుట్టిముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు.

సభ ప్రారంభం అయిన నిమిషాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో వైసీపీ మంత్రులు మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రులు అంబటి, బుగ్గన టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని.. అసెంబ్లీ అని ఫైర్ అయ్యారు. చర్చకు తాము సిద్ధం.. సహకరించాలని టీడీపీ ఎమ్మెల్యేలను కోరారు. టీడీపీ సభ్యులు ఆందోళన.. మంత్రుల కౌంటర్‌లతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో ఏపీ అసెంబ్లీ పది నిమిషాలు పాటు వాయిదా పడింది.

Advertisement

Next Story

Most Viewed