- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీ ప్రజలకు అలర్ట్... బర్డ్ ఫ్లూపై కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో బర్డ్ ఫ్లూ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు పశుసంవర్థక శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నెల్లూరు, కడప, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో ర్యాపిడ్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆ రెండు గ్రామాల్లో తప్ప బర్డ్ ప్లూ రాష్ట్రంలో ఎక్కడా వ్యాపించలేదని వెల్లడించారు. 712 ర్యాపిడి టీమ్స్ పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు.
కాగా బర్డ్ ఫ్లూతో నెల్లూరు జిల్లా పొదలకూరు, కోవూరులో వేల కోళ్లు మృతి చెందాయి. బాయిలర్, లేయర్, నాటు కోళ్లు సైతం బర్డ్ ఫ్లూ సోకి మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు శ్యాంపిళ్లను భూపాల్ ల్యాబ్కు పంపారు. అక్కడ పరిశీంచిన అధికారులు కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా పొదలకూరు, కోవూరులో శానిటైజేషన్ చేశారు. చికెన్ షాపులను మూయించివేశారు. బయట వ్యక్తులను ఆ రెండు గ్రామాల్లోకి అనుమతించడంలేదు.