- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ కు మద్దతుగా.. మరో టాలీవుడ్ హీరో ప్రచారం
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగనున్నాయి. మే 13 ఈ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ప్రస్తుతం పిఠాపురంపై పడింది. దేశ రాజకీయాలు ఒక ఎత్తు అయితే ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు ఒక ఎత్తుగా మారింది. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈ సారి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అలాగే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పవన్ స్టార్ క్యాంపైనర్ గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ యాక్టర్లు కదం తొక్కుతున్నారు.
ఇందులో భాగంగా మొదట జబర్దస్త్ నటులు, ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చంటి, రాజు, వంటి వారు ప్రచారం చేశారు.అలాగే సీరియల్ యార్టర్లు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ రెండు రోజుల పాటు పిఠాపురంలో తన బాబాయ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా మెగా మేనల్లుడు హీరో వైష్ణవ్ తేజ్ ఈ రోజు కొండెవరం గ్రామంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, ఆ ప్రాంత ప్రజలు అతనికి అడుగడుగునా నీరాజనం పట్టారు.