- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం.. ఆ స్థానం నుంచి ఎంపీగా షర్మిల పోటీ!
దిశ, వెబ్‌డెస్క్: రానున్న పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మెజార్టీ స్థానాలను దక్కించుకుని ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా దించనున్నట్లు తెలుస్తోంది. కడప నుంచి కంటెస్ట్ చేయాలని ఇప్పటికే షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సమాచారం అందించినట్లు తెలిసింది. హైకమాండ్ సూచన మేరకు షర్మిల సైతం కడపలో ఈ సారి ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 25న కాంగ్రెస్ ఏపీలో తొలి జాబితాను విడుదల చేసే చాన్స్ ఉంది. ఇదే లిస్టులో షర్మిల పేరు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికే వైసీపీ అధిష్టానం మరో సారి టికెట్ కేటాయించింది. దీంతో సోదరుడిపైనే షర్మిల పోటీకి దిగనుండటం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కడప నుంచి షర్మిల పోటీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read More..
సీఎం జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రైతు, కూలీ, డ్రైవర్