Ap News: ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై మరో పిటిషన్.. సడెన్‌గా రంగంలోకి దిగిన మాజీ ఎంపీ ఉండవల్లి

by srinivas |   ( Updated:2023-09-22 05:22:25.0  )
Ap News: ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై మరో పిటిషన్.. సడెన్‌గా రంగంలోకి దిగిన మాజీ ఎంపీ ఉండవల్లి
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. స్కిల్ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో మొత్తం 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు అంతేకాదు కేసును సీబీఐకి అప్పగించాలని అరుణ్ కుమార్ కోరారు. ప్రతి వాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు పేర్లను చేర్చారు.


కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వాదిస్తుంటే.. అసలు ఆధారాలు లేవని, కేసు కొట్టేయాలని చంద్రబాబు తరఫున వాదనలు కొనసాగుతున్నాయి.

అయితే ఈ కేసుకు సంబంధించి చాలా అనుమానాలు అటు నాయకుల్లో, ఇటు ప్రజల్లో తలెత్తుతున్నాయి. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగితే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఎందుకు ఈ కేసును మూవ్ చేయలేదనేది మొదటి ప్రశ్నగా వినిపిస్తోంది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కర్నూలు పర్యటనలో చంద్రబాబును సడెన్‌గా అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపైనా అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు కేసును సీబీఐకి అప్పగిస్తే అసలు దోషులు ఎవరనేది బయటకు వస్తుందనేది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భావనగా కనిపిస్తోంది. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐకు అప్పగించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉండవల్లి అరుణ్ హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా భావించాల్సి వస్తోంది. మరి ఉండవల్లి వేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరిస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి చంద్రబాబు జైలు నుంచి విడుదల అవుతారా.. లేదా అనే ఉత్కంఠ మాత్రం టీడీపీ శ్రేణులు, ప్రజల్లో కలుగుతుంది.

Read More Andhra Pradesh News. News About Chandrababu Naidu's Arrest

Advertisement

Next Story

Most Viewed