వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా.. త్వరలో జనసేనలోకి!

by GSrikanth |
వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా.. త్వరలో జనసేనలోకి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార వైసీపీకి వరుష షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బుధవారం సీఎం జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. ఇటీవల విడుదల చేసిన ఎమ్మెల్యేల జాబితాలో చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా విజయానందరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించడంతో ఆరణి ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే ఆయన్ను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story