పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య మరో లేఖ

by GSrikanth |   ( Updated:2024-03-06 13:54:54.0  )
పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య మరో లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు.. కాపు డిక్లరేషన్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా రెండో జాబితాలో బ‌లిజ సామాజికవ‌ర్గానికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని త‌న లేఖ‌లో ఆయ‌న పేర్కొన్నారు. రాయ‌ల‌సీమ‌లో 20 ల‌క్షల మంది వ‌ర‌కు బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఉన్నార‌ని గుర్తుచేశారు.

ఇప్పటివ‌ర‌కు ఏ రాజ‌కీయ పార్టీ కూడా రాజ‌కీయంగా వారికి ఎలాంటి ప్రాధాన్యత‌ ఇవ్వలేద‌ని, ఆ లోటును జ‌న‌సేన-టీడీపీ తీరుస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీతో జ‌న‌సేన పార్టీ పొత్తు అనంత‌రం త‌ర‌చూ ప‌వ‌న్‌కు హరిరామ జోగయ్య లేఖ‌లు రాస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రెండో జాబితాపై ఇరు పార్టీల అధినేతలు పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇవాళ హైదరాబాద్‌లో మరోసారి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య లేఖ రాయడం ఆసక్తిగా మారింది.


Read More..

AP Politics: ఆ విషయంలో స్తంభించిన అధిష్టానం.. అయోమయంలో ఏపీ బీజేపీ

Advertisement

Next Story